నాలుగు మంత్రి పదవులిస్తే.. అది సామాజిక న్యాయమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు మంత్రి పదవులిస్తే అది సామాజిక న్యాయమా? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక పాలన ఎక్కడుందో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు మళ్లీ తలెత్తుకొని తిరగాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ప్రజల్లో చైతన్యం లేక గత ఎన్నికల్లో టీడీపీని ఓడిరచారని పేర్కొన్నారు. ప్రజలకు టీడీపీ ఎంత చేసినా మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులు కాకుంటే ఇక బానిస బతుకులేనని అన్నారు.











































































