అధికారంలో ఉన్నది మీరే కదా.. దమ్ముంటే చర్చ

అధికారంలో ఉన్నది మీరే కదా మీకు, మీ నాయకుడు వైఎస్ జగన్‌కు దమ్ముంటే పెగాసన్ సాఫ్ట్వేర్ పై చర్చ జరిపి నిజానిజాలు ప్రజల ముందుంచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ కేంద్రం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, పార్లమెంట్లో చర్చ పెడితే విజయసాయి రెడ్డి కేసులకు భయపడి మోదీకి సలాం కొట్టి చర్చ వద్దన్నారని గుర్తు చేశారు. కానీ ప్రశాత్ కిషోర్‌కి చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు మీద బురద చల్లడానికి మమత బెనర్జీతో ఫేక్ మాటలు చెప్పించారన్నారు. ఇక్కడ అసెంబ్లీలో మాత్రం చర్చ కావాలంటున్నారని అన్నారు. చంద్రబాబు మీద బురద జల్లుతాం అంటే చూస్తు ఊరుకోబోమని, మీకు తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.











































































