అమూల్ పై ఉన్న శ్రద్ధ పాడి రైతులపై ఎందుకు లేదు? : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని పాడి రైతులను గాలికి వదిలేసి అమూల్‌కు ప్రమోటర్‌గా ప్రభుత్వం మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పాడి రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. లీటర్ రూ.4 బోనస్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పాడి రైతులను గాలికి వదిలేసి అమూల్‌కు ప్రమోటర్‌గా మారారన్నారు. అమూల్ పై చూపిస్తున్న శ్రద్ధ పాడి రైతులపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం అమూల్ కోసం దారి మళ్లిస్తున్నారన్నారు. అమూల్ వల్ల రూ.5 నుంచి 20 వరకు అదనపు లబ్ది అనేది అవాస్తవం. రాష్ట్రానికి చెందిన డెయిరీలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అమూల్ కోసం రూ.3 వేల కోట్లు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారు.
సహకార డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి పాల డెయిరీలో రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు పాలు కొంటున్నారు. దేశంలో ఎక్కడైనా లీటర్ పాలకు రూ.18 చెల్లించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సహకార డెయిరీలు, ఇతర సంస్థలను వదిలిపెట్టి బాలామృతం, అంగన్వాడీలకు పాల సరఫరా కోసం అమూల్‌తో ఒప్పందం చేసుకోవడం దుర్మార్గం. కక్ష సాధింపు చర్యలతో ఆయా డెయిరీల్లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్తకంగా మారిందనన్నారు. సహకార డెయిరీలను పునరుద్ధరిస్తామనే ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.











































































