ఇచ్చిన హామీ ఏంటి? అమలు చేస్తున్నదేమిటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధుల పెన్షన్ రూ.2 వేల నుండి రూ.3 వేలకు పెంచుతామని తిరుపతి సభలో జగన్ మోహన్ రెడ్డి చెప్పారని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా పెంచింది కేవలం రూ.250 మాత్రమేనన్నారు. జగన్ ఇచ్చిన హామీ ఏంటి? అమలు చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి, వైఎస్ కలిపి పెంచింది కేవలం రూ.375 మాత్రమేనన్నారు. వయోపరిమితి తగ్గించడంతో లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చామంటున్నారని చెప్పారు. కొత్తగా ఎంత మందికి పెన్షన్లు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.











































































