టీడీపీ అధికారంలోకి వచ్చిన.. తర్వాత వడ్డీతో సహా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంటరీ సర్వసభ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ ఉండకూడదని జగన్ రెడ్డి ప్రయత్నాలు చేశారని, జగన్ రెడ్డి నాన్న, తాత ముత్తాతలు కూడా టీడీపీని ఏం చేయలేకపోయారన్నారు. ఓటీఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే వైసీపీ పరిమితమవుతుందని అన్నారు.











































































