కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి ఖూనీ : అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీకటి జీవీలతో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం నియంత పాలనకు పరాకాష్ట అన్నారు. జగన్ రెడ్డి కనుసన్నల్లోనే టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జ్ జరుగుతోందని ఆరోపించారు. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని మండి పడ్డారు. చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా పర్యటన చేస్తున్నా అడ్డుకోవడం జగన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ పోకడలకు అద్దం పడుతోందన్నారు.













