ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు : అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని అనుకోవద్దని ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్లో తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈసారి కచ్చితంగా 160 స్థానాల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతులను జగన్ ప్రభుత్వం ముంచిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి రైతునూ కలవాలని రైతువిభాగం నేతలకు ఆయన నిర్దేశించారు. మాజీ మంత్రి వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్ సీఎం య్యూరని అన్నారు. హత్య కేసు నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. ప్రజల్లో ఇప్పుడున్నంత వ్యతిరేకత ఎప్పుడూ లేదన్నారు.











































































