ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజేలోనే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు రావడం కలకలం రేపుతోంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా, అనంతపురంలో జిల్లాలో రెండు, కర్నూలు రెండు, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
గడిచిన 23 గంటల్లో 31,743 మంది నమూనాలు పరీక్షించగా, కొత్తగా 186 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1049 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.