ఫేస్ బుక్ లో మోదీ హవా
సోషల్ మీడియా వినియోగంలో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకెళ్తున్నారు. ఫేస్బుక్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రికార్డు సృష్టించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెక్కి అగ్రస్థానంలో నిలిచారు. మోదీ వ్యక్తిగత పేజీకి 4.35 కోట్లు లైకులు రాగా, అధికారిక పేజీకి 1.37 కోట్ల లైకులు రావడం గమనార్హం. ఈ మేరకు బీసీడబ్ల్యూ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2.3 కోట్ల లైకులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాతి జోర్డాన్ రాణి రాణియా 1.69 కోట్ల లైకులతో మూడోస్థానం దక్కించుకున్నారు. ఇక బ్రేజిల్ నూతన అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో ప్రపంచంలోనే విశేషాదరణ పొందుతున్న నేతగా గుర్తింపు దక్కించుకున్నారు.













