రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ నామినేషన్
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేస్తున్న మీరాకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీఆజాద్, సీతారం ఏచూరి, శరద్ పవార్ తదితరుల సమక్షంలో మీరాకుమార్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు ఆమె రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించి పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. విపక్షంలోని 17 పార్టీలు ఆమెకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ దేశంలో కుల వివక్షను రూపుమాపడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికను దళిత్ వర్సెస్ దళిత్ గా అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను నేడు సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.













