ఆ లేఖ అబ్ధదం… ఆ వార్తలో నిజం లేదు
రోనాల్డ్ విల్సన్ ల్యాప్ ట్యాప్ లో దొరికిన లేఖ అబద్ధమని, లేఖలో తన పేరు ప్రస్తావించడంలో వస్తున్న వార్తలో నిజం లేదని విప్లవ సంఘం నేత వరవరరావు సృష్టం చేశారు. ఇదంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. పూణే పోలీసులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. రోనాల్డ్ విల్సన్ తనకు తెలుసని, అయితే రాజకీయ ఖైదీల విడుదలకు కృషి చేస్తున్నాడని తెలిపారు. అక్రమంగా అరెస్టులు చేసి ప్రజా ఉద్యమాలను అణచివేతకు బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. వరంగల్‌లో అరెస్ట్ చేసిన డీఎస్‌యూ యూనియన్ నాయకులు భద్రి, రంజిత్ సూరి, సుదీర్ లను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.













