వెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం దక్కింది.అంతర్జాతీయ అత్యున్నత పదవికి వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. 58 దేశాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆవాస పాలక మండలి అధ్యక్షునిగా వెంకయ్య ఎన్నికయ్యారు. కెన్యాలోని నైరోబీలో జరిగిన ఐరాస ఆవాస పాలక మండలి సమావేశం వెంకయ్యను అధ్యక్షునిగా ఎన్నుకుంది. వెంకయ్యనాయుడు ఎన్నికపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఐరాస లక్ష్య సాధనలో వెంకయ్య తన వంతు కృషి చేస్తారన్న పూర్తి విశాస్యం తనకు ఉందని మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐరాస ఆవాస పాలకమండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం భారత్కు గతంలో రెండుసార్లు దక్కిందని, మూడోసారి తాను అధ్యక్షునిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.













