కాంగ్రెస్ లోకి హార్దిక్ పటేల్?
పటేళ్ల రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ పర్యటలో ఉన్న రాహుల్ గాంధీ అహ్మదాబాద్‌లోని ఓ హోటల్లో హార్దిక్ పటేల్‌ను కలుసుకున్నారు. దీంతో హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరడం ఖామయైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఓబీసీ నవసర్జన్ జనాదేశ్ మహాసమ్మేళన్‌లో రాహుల్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు నేతలూ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ సభలో హార్దిక్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అయితే, హార్దిక్ కాంరగెస్ చేరే విషయాన్ని ఇదే వేదిక నుంచి ప్రకటిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.













