ఐటీ శాఖ కీలక నిర్ణయం…
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 లక్షల వరకు పెండింగ్లో ఉన్న రిఫండ్లను వెంటనే ఆయా ఐటీ చెల్లింపుదారుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. దీంతో దాదాపు 14 లక్షల మంది వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు లబ్ధి పొందుతారని అంచనా. దీనికి తోడు సుమారు లక్ష వ్యాపార సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ.18,000 కోట్ల జీఎస్టీ, కస్టమ్స్ రిఫండ్స్నూ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అనేక ఎంఎస్ఎంఈలు కూడా ప్రయోజనం పొందుతాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు, వ్యాపార సంస్థల దగ్గర నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.













