వైఎస్ జగన్ను అభినందించిన కేజ్రీవాల్
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని ఇప్పటికే కేబినెట్, అసెంబ్లీ, శాసన మండలి కూడా ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. అత్యాచార కేసు నమోదైనా అది 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి సరైన సాక్ష్యాధారాలు ఉంటే దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చేయ్యాల్సి ఉంటుంది. అయితే జగన్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక చట్టాన్ని తీసుకురావడంతో పలువురు అభినందించారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. ఈ మేరకు వైఎస్ జగన్కు కేజ్రీవాల్ లేఖ రాశారు. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును పంపాలని లేఖలో కేజ్రీవాల్ కోరారు.













