ఇప్పటి వరకు ఇదే రికార్డు
గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో 51 మంది మరణించారు. ఇప్పటి వరకు ఒక్కసారే ఇంతమంది మృతి చెందడం ఇదే తొలిసారి. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 324కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 9,532కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. గడిచిన 24 గంటల్లో 905 కొత్త కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ పొడిగించే యోచనలో వున్న కేంద్రం అన్ని జిల్లాలకు కలర్ కోడ్ విధించాలని యోచిస్తోంది. 15కి పైగా పాజిటివ్ కేసులు వుంటే రెడ్ జోన్, అంతకన్నా తక్కువ వుంటే ఆరంజ్ జోన్, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేని ప్రాంతాలకు గ్రీన్ జోన్‌గా విధించాలని భావిస్తోంది. కలర్ కోడ్‌ను ప్రభుత్వం తీసుకువస్తే దాదాపు దేశంలో సగం ప్రాంతాలు రెడ్ లేదా ఆరంజ్ జోన్లో వుంటాయని భావిస్తున్నారు.













