24 గంటల్లో 1211 కేసులు …
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,211 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదైనట్టు కేంద్ర వెల్లడించింది. అలాగే 179 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 10,363 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా. వారిలో 339 మంది మృతిచెందారనీ, మరో 1,039 మంది కోలుకున్నారని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 166 ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు 70 ప్రైవేటు ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా ఇప్పటివరకు 2,31,902 పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.













