సేఫ్టీ ముఖ్యం…
ఇండియా లో కరోనా మొదలయిందే కేరళ రాష్ట్రం లో. మొదటి నాలుగు -ఆరు వారాలలో కేరళ రాష్ట్రం లో కేసులు కూడా బాగానే వచ్చాయి. కానీ ఈ రోజు, ఇండియా లో కరోనా ని కట్టడి చేసిన రాష్ట్రాలలో కేరళ ముందుంది. అందుకు ప్రభుత్వం చేప్పట్టిన పనులు, తీసుకొన్న నిర్ణయాలు కంటే ప్రజలు అర్థం చేసుకొని కరోనా రాకుండా పాటించాల్సిన జాగర్తలు అమలు చేయటమే అనడానికి ఒక ఉదాహరణ.. ఓ కిరాణా కొట్టు యజమాని సరకులు ఏ విధం గా ఇస్తున్నాడో చూస్తే అర్థం అవుతుంది. తరువాత సరుకులు తీసుకొనే వారు కూడా ఎంత దూరం దూరంగా ఉండి తమ సమయం కోసం క్యూ లో ఎదురు చూస్తున్నారో చూడండి.













