ఎన్ఆర్పై భర్తలపై భార్యల ఫిర్యాదు
గత ఐదేళ్లలో ఎన్ఆర్ఐ భర్తలు తమను వరకట్నం కోసం గృహహింసకు పాల్పడ్డారని ఆరువేల మంది వివాహితలు కేంద్ర విదేశాంగశాఖకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనం రేపింది. 2015 జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు 6 వేల మంది వివాహితలు తమ ఎన్ఆర్ఐ భర్తల బాగోతాలపై ఫిర్యాదులు సమర్పించారని వెల్లడైంది. గడచిన ఐదేళ్లలో ఆరువేల మంది ఎన్ఆర్ఐలపై వారి భార్యలు ఫిర్యాదు చేశారని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. సాక్షాత్తూ పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
ఈ ఏడాది 991 మంది వివాహితులు ఎన్ఆర్ఐల భర్తల దాష్టీకాలపై ఫిర్యాదు చేశారు. 2018లో 1299 మంది, 2017లో 1498 మంది, 2016లో 1510 మంది, 2015లో 796 మంది మహిళలు ఫిర్యాదులు సమర్పించారని మంత్రి మురళీధరన్ చెప్పారు. కువైట్, సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఓమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఈ ఏడాది 4,823 మంది మరణించారని మంత్రి వివరించారు.













