మాజీ ప్రధాని దేవేగౌడతో సీఎం చంద్రబాబు సమావేశం
ఈవీఎం, వీవీ ప్యాట్లలో చోటు చేసుకున్న అక్రమాలపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఏమాత్రం ఫలితం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. బెంగళూరులోని పద్మనాభనగర్‌లో మాజీ ప్రధాని దేవేగౌడ్తో జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ 22 ప్రాంతీయ పార్టీల నేతలు ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారని, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈవీఎంల పున వినియోగంపై కేంద్రం ద్వంద్వ నీతి పాటిస్తోందన్నారు. బీజేపీ గతంలో ఈవీఎంల పనితీరుపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని, ప్రస్తుతం ప్రతిపక్షాల ఆక్షేపణలను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హోటళ్లు, ఇళ్లలో యంత్రాలను భద్రపరుస్తున్నారని, ప్రైవేటు వాహనాల్లో ఈవీఎంలను తరలించటం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.













