స్మార్ట్ సిటీలుగా అమరావతి, కరీంనగర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా మూడో విడత ఆకర్షణీయ నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 30 నగరాలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం తొలిస్థానంలో నిలవగా, తెలంగాణ నుంచి కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి చోటు దక్కించుకున్నాయి. తమిళనాడు నుంచి 4, కేరళ 1, యూపీ 3, కర్ణాటక 1, గుజరాత్ 3, ఛత్తీస్‌గఢ్ నుంచి 2 నగరాలు ఎంపికయ్యాయి. దీంతో ఇప్పటివరకూ 90 నగరాలు స్మార్ట్‌సిటీ మిషన్ కిందకు చేశారు. ఒక్కో నగరానికి ఏడాదికి రూ.200 కోట్లు కేంద్రం విడుదల చేస్తుంది.













