ఢిల్లీ వాసులకు మరో శుభవార్త
అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు మరో శుభవార్త వినిపించారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 201 నుంచి 400 యూనిట్ల వరకు ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీ అందుతుందని వెల్లడించారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమని కేజ్రీవాల్ అభివర్ణించారు. నేడు దేశంలోనే చౌకైన విద్యుత్ ఢిల్లీలో ఉంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. ఇది ఆమ్ఆద్మీకి ఎంతో ఉపయోగపడుతుది. ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద ప్రతి నెలా 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించిన వారికి ఎలాంటి బిల్లూ రాదు అని కేజ్రీవాల్ వెల్లడించారు.













