జపాన్ విలయం వెనక…?
జపాన్‌లో భూకంపం మహావిలయాన్ని సృష్టించింది. భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 62 మంది మృతులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరగొచ్చని సమాచారం తెలిపారు.
నూతనేడాది జపాన్ భూకంపంతో అతలాకుతలమైంది. జనవరి 1న జపాన్ …రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి వణికిపోయింది. ముఖ్యంగా నోటో ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమైంది. వేలాది భవనాలు కుప్పకూలాయి. మరికొన్ని ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనల్లో 62 మంది మృతి చెందడంతోపాటు మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో 20 మంది పరిస్థితి దాదాపు 32 వేల మంది నిరాశ్రయులుగా మారారని.. వారంతా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. తీర ప్రాంతంలోని సుజు పట్టణంలో దాదాపు 90 శాతం ఇళ్లు ధ్వంసమైనట్లు మేయర్ మషురో ఇజుమియా తెలిపారు. ఇప్పటికీ చాలా మంది సాయం కోసం వేచిచూస్తున్నారని స్వయంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా తెలిపారు. వారందరినీ ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానిక యంత్రాంగాలన్నీ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. జపాన్ వ్యాప్తంగా భూకంప తీవ్రత ఉంది. ముఖ్యంగా నార్త్ సెంట్రల్ జపాన్ లో పెను ప్రభావం చూపింది. ఇషివాక, నీగాటా, టొయామా తదితర తీర ప్రాంత నగరాలపై సునామీ అలల ప్రభావం కనిపించాయి. భూకంపంతో రోడ్లు బీటలు వారాయి. భవనాలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.













