Israel: బోండీబీచ్ ఉగ్రఘటనను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా విఫలం.. ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్ చేసిన ఉగ్రమూక దాడిలో 16 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఓటెర్రరిస్ట్లు హతమయ్యాడు.
యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు.
మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
బాండీ బీచ్లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి’’ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు.






