హర్మూజ్ పై ట్రంప్ మాటలు గాలిమేడలే.. ఇరాన్ సెటైర్లు..!
అమెరికా, ఇరాన్ మధ్య చర్చల సరళి చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఓ వైపు ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు, హెచ్చరికలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు.. చర్చల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో రీసెంట్ గా ట్రంప్.. ఇరాన్‌తో త్వరలో ఓ ఒప్పందం కుదరనుందని తెలిపారు. దీంతో వారు మాకు ఉచితంగా చమురు, హర్మూజ్ జలసంధిని అందించనున్నారని వ్యాఖ్యానించారు.
అయితే…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ (Iran)తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మాట్లాడుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనికి ‘అమెరికా అధ్యక్షుడు గాల్లో మేడలు కడుతున్నారు’ అని పేర్కొంది. ఈ సందర్భంగా ట్రంప్ ఎక్కువగా ఊహించుకుని, తప్పులకు పాల్పడుతున్నారనే ఉద్దేశం వచ్చేలా ఒక సామెతను కూడా అది ప్రస్తావించింది.
శుద్ధి చేసిన యురేనియం (Enriched Uranium) నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇరాన్ ఈ వాదనలను కొట్టిపారేసింది. ఇప్పటివరకు అలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్ మరో అబద్ధపు ప్రకటన చేశారని తెలిపాయి. అలాంటి పెద్ద పురోగతి ఏదీ సాధించలేదని.. ఇరాన్ షరతులన్నింటికీ అమెరికా అంగీకరిస్తేనే చర్చలు కొనసాగుతాయని స్పష్టంచేశాయి.
ఇవి కూడా చదవండి






