బాహుబలి 3పై క్లారిటీ.. రాజమౌళి ప్లాన్ వేరే!
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) పేరు వినిపించినప్పుడల్లా ఆయన నెక్ట్స్ మూవీ ఏమై ఉంటుందా అనే డిస్కషన్ మొదలవడం సహజం. ప్రస్తుతం వారణాసి(Varanasi) తర్వాత ఆయన బాహుబలి3(Bahubali3) లేదా ఆర్ఆర్ఆర్2(RRR2) తెరకెక్కిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సీక్వెల్స్ సమీప భవిష్యత్తులో పట్టాలెక్కే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికే రూపొందించిన ప్రపంచాలను విస్తరించడం కంటే, పూర్తిగా కొత్త కథలు సృష్టించడంపైనే రాజమౌళి ఎక్కువ ఆసక్తి చూపుతారని ఆయన కెరీర్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది.
గతంలో ఈగ2(Eega2) గురించి కూడా పలు సందర్భాల్లో ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అదే తరహాలో బాహుబలి3, ఆర్ఆర్ఆర్2 పేర్లు అభిమానుల మధ్య డిస్కషన్స్ లో నిలిచినా, వాటి నిర్మాణంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు. మరోవైపు ఎన్నేళ్లుగా తన కలల ప్రాజెక్ట్‌గా చెప్పుకొస్తున్న మహాభారతం(Maha bharatham)పై రాజమౌళి దృష్టి పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
అయితే బాహుబలి బ్రాండ్‌ను పూర్తిగా పక్కన పెట్టే ఆలోచన మాత్రం లేదని తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీని యానిమేషన్‌తో పాటు ఇతర ఫార్మాట్లలో విస్తరించే ప్రణాళికలున్నాయని సమాచారం. అందుకే అప్పుడప్పుడు బాహుబలి ప్రపంచంపై ఆసక్తిని పెంచే కామెంట్స్, ప్రచారాలు వినిపిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ప్రస్తుతం బాహుబలి3ని లైవ్ యాక్షన్ సీక్వెల్‌గా రూపొందించే ఆలోచన మాత్రం రాజమౌళి ప్రణాళికల్లో లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.








