కేసీఆర్ కృషి మరువలేనిది…
తెలుగు భాష పరిరక్షణకు తెలంగాణ సిఎం కెసిఆర్ చేస్తున్న క షి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆధునికత పేరుతో ఇంగ్లీషుపై వ్యామోహం పెరిగిందని, ఇంగ్లీషు వస్తేనే ఉద్యోగం వస్తుందన్న భావనలో ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన తెలంగాణ సారస్వత పరిషత్తు 75ఏళ్ల మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భాష, కళలు, వాక్కు, సాహిత్యం వంటి వాటిని సరస్వతిదేవి మనకు ఇచ్చిన వరాలు అని ఆయన చెప్పారు. తెలంగాణ సారస్వత పరిషత్‌కు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సారస్వత పరిషత్తు ప్రచురించిన పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. మాత భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరు కషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.













