పార్శిల్ లో పౌడర్… ట్రంప్ కోడలికి అస్వస్థత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు వానెస్సాకు ఓ కవర్లో వచ్చిన పౌడర్ కలకలం సృష్టించింది. ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ భార్య వానెస్సాకు ఓ పార్మిల్ వచ్చింది. కవర్ తెరవగానే ఆమెపై తెల్లని పౌడర్ పడింది. దీంతో ఆమెకు తలతిరగడం, వికారం అనిపించడంతో న్యూయార్క్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న మరో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రంప్ జూనియర్ పేరుతో పార్శిల్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. పౌడర్‌ను పరీక్షించిన అధికారులు ప్రమాదకరమైనది కాదని తేల్చారు.













