విడాకులు తీసుకుంటున్న జంటకు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు
అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకంజీ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెగ నచ్చేసినట్లుయింది. మీడియా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చినపుడు. ఓహ్ చాలా శుభం. బెజోస్‌కు నా శభాకాంక్షలు అని బదులిచ్చారు. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి మూడో భార్యతో ప్రస్తుతం జీవినం సాగిస్తున్న ట్రంప్‌కు విడాకులనేది పెద్ద ఆందోళన పడాల్సిన విషయం కాదని అమెరికన్ మీడియా గతంలోనే వ్యాఖ్యానించింది. నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన ట్రంప్ ఆయనకు నా గుడ్ లక్ చెబుతున్నాను అని పేర్కొనడం విశేషం. నిజానికి ట్రంప్‌కు, బెజోన్కు మధ్య సత్సంబంధాలేవీ లేవు. తన పాలనపై బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ కొన్ని ప్రతికుల వార్త కథనాలు ప్రచురించడంపై ట్రంప్ గతంలో మండిపడ్డారు కూడా. 137 బిలియన్ డాలర్ల సంపద గల బెజోస్ తన భార్యకు విడాకులివ్వడం ద్వారా ఆస్తిలో సగానికి సగాన్ని కోల్పోవడమే కాక అపర కుబేరుడన్న ఖ్యాతిని కూడా పొగొట్టుకోనున్నారు.













