చూసీ చూడంగానే ప్రీ రిలీజ్ వేడుక
శివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం చూసి చూడంగానే. శేష సింధు దర్శకురాలు. రాజ్ కందుకూరి నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కథానాయకులు నిఖిల్, శ్రీవిష్ణు బిగ్ టికెట్‌ని కొనుగోలు చేశారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ శివ చూడగానే నచ్చాడు. నాకు పోటీగా ఓ హీరో వచ్చాడు అనిపించింది. మంచి స్థాయికి వెళ్తాడన్న నమ్మకం ఉందన్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ గోపీ సుందర్ సంగీతం నాకు ఇష్టం. రాజ్ కందుకూరి లాంటి తండ్రి ఉండడం శివ అదృష్టం అన్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ శివ సినిమా విడుదల అవుతుంటే మా పిల్లల సినిమా వస్తున్నంత ఆనందంగా ఉంది. ఈ సినిమాతో శేష సింధు మహిళ శక్తిని మరోసారి నిరూపించాలి. ఆమెను చూసి మరింత మంది అమ్మాయిలు ఈ రంగంలోకి రావాలన్నారు. ఈ చిత్రంలో అమ్మ పాత్రలో నటించమన్నారు. కానీ ఆరోగ్యం సహకరించక పోవడంతో కుదరలేదన్నారు రేణూదేశాయ్. నిర్మాత మాట్లాడుతూ ఏడాదికి ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ సినిమా తీశానన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ ప్రతీ పాత్రనీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారన్నారు. కార్యక్రమంలో తరుణ్ భాస్కర్, శివ, మాళవిక, వర్ష, గోపీసుందర్ తదితరులు పాల్గొన్నారు.













