‘బ్లాక్ బోర్డ్స్ ఫర్ బెటర్ డ్రీమ్స్’ క్యాంపెయిన్ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో 200 బ్లాక్ బోర్డ్స్ ని బాగుపరిచిన జీ తెలుగు
జీ తెలుగు రేపటి జీవితాలని ఏ విధంగా మార్చుకోవాలని ఈ రోజు కధనంలోనే అందరికి చూపిస్తూ, ఎప్పుడూ వినూత్నంగా ముందుకు వెళుతుంది. గణతంత్ర దినోత్సవం నాడు జీ తెలుగు ఒక కొత్త అడుగుతో చిన్నారుల జీవితాలని వెలుగు దారిలోకి ప్రవేశించేలా చేసింది. ఎలా అంటే? మన పాఠశాల లో బ్లాక్ బోర్డు పైన నేర్చుకున్న పాటాలే రేపటి మన భవిష్యత్తు కి ఆరంభం. ఆ బ్లాక్‌బోర్డు పై సాల్వ్ చేసిన లెక్కలు, టీచర్ అడిగిన ప్రశ్నలకు జవాబు రాసిన జ్ఞాపకాలు ఎన్నో. స్నేహితుల పేర్లు రాసి అల్లరి చేసిన గుర్తులెన్నో. ఇలా మన బాల్యం లో ఎన్నో మధురానుభూతులకు కారణమైన బ్లాక్‌బోర్డు ని మార్చడానికి జీ తెలుగు తొలి అడుగు వేసింది.
ఎన్నో బడులలో పాడైపోయిన బ్లాక్ బోర్డ్స్ కి బదులుగా కొత్త బ్లాక్ బోర్డులను మార్చింది. ఎన్నో వేల సరికొత్త జ్ఞాపకాల వైపుకి, పిల్లల ఉజ్వల భవిష్యత్ ఆరంభానికి జీ తెలుగు వేసిన ఒక్క అడుగు – ‘బ్లాక్ బోర్డ్స్ ఫర్ బ్రెటర్ డ్రీమ్స్’. 2021 అక్టోబర్ లో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ స్కూల్స్ ని ప్రారంభించినప్పుడు జీ తెలుగు పాడైన బ్లాక్ బోర్డ్స్ ని చూసి వాటిని మార్చాలని, రేపటి పౌరులకు బంగారు భవిష్యత్ ఇవ్వడానికి సిద్ధమైంది. అలా ఎన్నో ఆలోచనల నుంచి వచ్చిన ఒక ఉదేశ్యం ఈ కార్యం. అలా గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించిన ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో, దీక్షతో జీ తెలుగు ముందుకు తీసుకొనివెళ్ళింది. ఎం పి పి ఎస్ – గ్రామం, తడ్కపల్లి – మండలం సిద్దిపేట లో ఇటీవలే 200 బ్లాక్ బోర్డ్స్ ని తీర్చిదిద్ది మరోసారి ‘ఆరంభం ఒక్క అడుగుతోనే’ అని నిరూపించింది.
చీఫ్ కంటెంట్ ఆఫీసర్ – తెలుగు, అనురాధ గూడూరు మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలనే మా ఉదేశ్యం తో ‘బ్లాక్‌బోర్డ్ ఫర్ బ్రైటర్ డ్రీమ్స్’ ప్రారంభించాము, దీని ద్వారా వారి భవిష్యత్తు వెలుగు బాటలో నడుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇటీవల 200వ బ్లాక్ బోర్డు ని బాగుపరిచి జీ తెలుగు చాలా మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసింది. ఇలానే మేము ముందుకు సాగుతూ మరెన్నో జీవితాలని వెలుగు మార్గంలో తేవడానికే తప్పకుండా కృషి చేస్తాము.”













