యువరాజ్‌సింగ్ అరుదైన ఘనత.. అంతరిక్షంలోకి
టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యువీ తొలిసారి సెంచరీ చేసిన బ్యాట్‌ను ఎన్ఎఫ్టి మార్కెట్ కలెక్షన్ సంస్థ అంతరిక్షంలోకి పంపింది. ఈ వీడియోను సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. 2003లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో యువరాజ్‌సింగ్ తన తొలి సెంచరీని నమోదు చేశాడు. 27వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన యువీ 85 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గంగూలీ సారథ్యంలోని ఆ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్‌ను 76 పరుగులకు అలౌట్ చేసి ఘన విజయం సాధించింది.













