యూపీ సీఎంగా యోగి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు యోగి వరుసగా రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు సమచారం. కొత్తం మంత్రివర్గంలో 20 మందికి పైగా కేబినెట్ హోదా మంత్రులు ఉంటారని, దాదాపుగా అదే సంఖ్యలో స్వతంత్య్ర సహాయ హోదా అమాత్యులు ఉంటారని తెలుస్తోంది.













