చరిత్ర సృష్టించబోతున్న యోగి ఆదిత్యనాథ్ .. 37 ఏళ్ల తర్వాత
ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళిని బట్టి బీజేపీ 260కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రధాన ప్రత్యర్థి సమాజ్వాద్ పార్టీ 125 చోట్లు, బీఎస్పీ 5, కాంగ్రెస్ 3, ఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా రెండోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారిగా సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 1985 తర్వాత యూపీలో వరుసగా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతే వచ్చాయి. కానీ, ఈ సంప్రదాయానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్తి పలికారు. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఓ పార్టీ అధికారంలోకి రానుంది.













