యూపీ సీఎం యోగిపై… అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
దేశంలో బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజరుతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి ప్రభుత్వం కూల్చివేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కచ్ నగరంలో ఓ ర్యాలీలో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ సీఎం యోగిపై విరుచుకుపడ్డారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.













