యూపీ బీజేపీ శాసనసభా పక్ష నేతగా యోగి ఎన్నిక
యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టనున్న యోగి ఆదిత్యానాధ్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. యూపీ డిప్యూటీ సీఎంగా కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపిక కూడా లాంఛనప్రాయమేనని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మౌర్య సిరాధు అసెంబ్లీ స్థానం పోటీ చేసి ఎస్పీ అభ్యర్థి పల్లవి పటేల్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలకు కాషాయ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓబీసీ ఓటర్లలో గట్టిపట్టుకున్న మౌర్యకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని బీజేపీ నిర్ణయించింది.













