కోలుకున్నాక యోగా చేయండి
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు పూర్తిగా ఆరోగ్యం సంతరించుకొనేందుకు యోగాసనాలు వేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. రోజూ ఉదయం, సాయంత్రం యోగాసానాలు వేస్తూ ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తూ ఛావన్ప్రాశ్ తింటే త్వరగా కోలుకుంటారని జారీచేసిన నూతన మర్గాదర్శకాల్లో వివరించింది. అంతకు ముందే అనారోగ్యంత ఉన్నవారు, కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడినవారు నెగెటివ్ వచ్చిన తర్వాత కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తూ శ్వాసకు సంబంధించిన కసరత్తులు చేయాలి. ఇందుకోసం ఫిజియన్ సలహా తీసుకోవాలి అని సూచించింది.













