బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలి… లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేసింది. లేదంటే, దేశ వ్యాప్తంగా ఆందోళనలను ఉధ్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రెజ్లర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలి. లేదంటే అదే రోజు నుంచి రెజ్లర్లతో సహా జంతర్ మంతర్ వద్ద మేం కూడా దీక్షకు కూర్చుంటాం. దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం అని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ తెలిపారు. రెజ్లర్ల పై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలన్నారు.













