ప్రపంచదేశాలు భారత్కు శుభాకాంక్షలు
స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్కు శుభాకాంక్షలు తెలిపాయి. భారత్తో స్నేహం, శాంతి ముందుముందు మరింత వర్ధిల్లాలని ఆకాంక్షించాయి. భారత్, అమెరికా మధ్య గొప్ప స్నేహం ఇలాగే కొనసాగాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఆస్ట్రేలియా భారత్ పరస్పర నమ్మకం, గౌరవంతో ఇకముందు కూడా పురోగమించాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, నేపాల్ ప్రధాని ఓలీ, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం, శ్రీలంక ప్రధాని మహింద శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.













