యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం
ఫ్యాక్టరీల్లో ఉపాధి పొందే మహిళల పని వేళలపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని ఆదేశించింది. ఒకవేళ పని చేయిస్తే ఆ మహిళలకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలను కల్పించాలని తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మే 27న జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళ లిఖితపూర్వక సమ్మతి తెయజేసినపుడు మినహా, ఏ మహిళ చేత అయిన ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని తెలిపింది. రాత్రి ఏడు గంటల తర్వాత కానీ, ఉదయం 6 గంటలకు ముందు కానీ పని చేయడానికి తిరస్కరించిన మహిళను ఉద్యోగం నుంచి తొలగించరాదని చెప్పింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పని చేసే మహిళలకు వారి ఇళ్ళ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి వారి ఇళ్లకు ఉచిత రవాణా సదుపాయన్ని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యమే కల్పించాలని తెలిపింది. అదేవిధంగా వారికి ఆహారాన్ని కూడా యాజమాన్యమే అందజేయాలని పేర్కొంది.













