లోక్ సభలో కీలక పరిణామం.. రాహుల్ గాంధీపై
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి బయటకు వెళుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తొలుత రాహుల్ మాట్లాడారు.తన ప్రసంగం ముగిసిన కాసేపటికే ఆయన బయటికెళ్లారు. వెళ్తూవెళ్తూనే ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. రాహుల్ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.













