ఏ పార్టీ ఆఫర్ ఇచ్చినా.. ఆ పదవి నాకొద్దు
తనకు రాష్ట్రపతి పదవి ఇస్తామని ఏ పార్టీ ఆఫర్ ఇచ్చినా అంగీకరించబోనని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే మాయవతి రాష్ట్రపతి అవుతారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసత్యప్రచారం చేశారని ఆమె తెలిపారు. తన అభిమానులను తప్పుదారి పట్టించారన్నారు. గతంలో రాష్ట్రపతి పదవిని కాన్షీరాం తిరస్కరించారని, ఆయన శిష్యురాలినైన తాను మాత్రం ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించారు. ఒకవేళ అలాగే చేస్తే తమ పార్టీ చరిత్ర ముగిసిపోయినట్లేన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను ఎట్టపరిస్థితుల్లోనూ ఏ పార్టీ ఇవ్వజూపినా రాష్ట్రపతి పదవి చేపట్టనని తెలిపారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి కారణాలను విశ్లేషించుకుంటామని యామవతి పేర్కొన్నారు.













