యడియూరప్పకు లైన్ క్లియర్.. మరో రెండేండ్లు కూడా

కర్ణాటక ముఖ్యమంత్రిగా మరో రెండేండ్లు తానే ఉంటానని యడియూరప్ప తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకటన తనకు మరింత శక్తినిచ్చిందని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా కసరస్తు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు యడియూరప్ప స్పష్టం చేశారు. మిగతా రెండేండ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని వెల్లడించారు.