ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. జూన్ 5నే బయటకు వస్తా

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే, జూన్ 5నే తాను తిహాడ్ జైలు నుంచి విడుదలవుతాయనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ పార్టీ కార్యాలయాంలో ఆప్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు తను అవమాపరిచే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. తిహాడ్ జైలులోని తన గదిలో రెండు సీసీటీ కెమెరాలు అమర్చారని, ఆ దృశ్యాలను 13 మంది అధికారులు పర్యవేక్షించారని ఆరోపించారు. సీసీటీవీ దృశ్యాలను ప్రధాని కార్యాలయానికి అధికారులు అందజేసినట్ల కేజ్రీవాల్ ఆరోపించారు. మోదీ తనను గమనించే వారని కౌన్సిలర్లతో తెలిపారు. తనపై మోదీకి అంత అక్కసెందుకో అర్థం కావడం లేదన్నారు. జన్ 2న తిరిగి జైలుకు వెళతానన్న కేజ్రీవాల్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను జైలు నుంచే చూస్తానని తెలిపారు.