వాట్సప్ నిబంధనలు అంగీకరించకుంటే.. ఆ ఖాతాను

సరికొత్త గోప్యతా నిబంధనలను ఎవరైనా అంగీకరించకపోతే ఆ ఖాతాను డిలీట్ చేయమని వాట్సప్ తెలిపింది. అయితే పరిమిత సేవలే లభ్యమవుతాయని తెలిపింది. అలా అంగీకరించని వినియోగదార్లు చాట్ లిస్ట్ ను యాక్సెస్ చేయలేరని, వ్సాప్ ద్వారా వచ్చే ఆడియో, వీడియో కాల్స్ కు ఆన్సర్ చేయలేరని తెలుస్తోంది. ఈ నిబంధనలను అంగీకరించని వారికి రిమైండర్లు పంపడం కొనసాగిస్తామని, అది అంగీకరించేంత వరకు పరిమితి సేవలే అభ్యమవుతాయని పేర్కొంది. అయితే ఎంత కాలం వరకు రిమైండర్లు పంపుతారనేది వెల్లడించ లేదు. పరిమితి సేవలు కొన్ని వారాల పాటు ఇచ్చాక కూడా అంగీకారం తెలపకపోతే మెసేజ్‍లు, కాల్స్ ను నిలిపివేస్తామని తెలిపింది. అయితే మే 15 కల్లా ప్రైవసీ పాలసీ అప్‍డేట్‍ను అంగీకరించని వారి ఖాతాలను డిలీట్ చేయమని, సేవలూ కొనసాగుతాయని గత వారం తెలిపింది.