బెంగాల్‍లో శాసన మండలి ఏర్పాటు ?

పశ్చిమ బెంగాల్‍లో త్వరలో లెజిస్లేటివ్ కౌన్సిల్ (విధాన పరిషత్)ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1969 వరకు కౌన్సిల్ ఉండేది. ఇటీవల ఎన్నికల్లో కౌన్సిల్ ఏర్పాటుకు టీఎంసీ హామీ ఇచ్చింది. మమత బెనర్జీ, ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ప్రస్తుతం అసెంబ్లీ సభ్యులు కాదు. కౌన్సిల్ ఏర్పాటు చేస్తే మీరు అందులో నామినేట్ కావడం సులభమవుతుంది. ఎన్నికలను ఎదుర్కోవల్సిన అవసరం లేదు. కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటే అసెంబ్లీలో బిల్లును ప్రవేశప్టెడం, బిల్లుకు గవర్నర్ ఆమోదించడం అవసరం. దీనిపై కేంద్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.