సీఎం మమత కీలక నిర్ణయం… మే 16 నుంచి

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, లాక్‍డౌన్ వంటి కట్టడి చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతమైన పెరుగుదల నేపథ్యంలో మే 16 నుంచి 30 వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‍డౌన్ విధిస్తూ మమతా బెనర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో రేపటి (ఆదివారం) నుంచి లాక్‍డౌన్ ఆంక్షలు అమల్లోకి రానుంది. పశ్చిమబెంగాల్‍లో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.