ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. బెంగాల్ లోనే చాలా తక్కువగా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యే జీతాలను పెంచారు. 40 వేల వరకు జీతాన్ని పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ఈ ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి నెల జీతాన్ని మాత్రం మార్చడం లేదన్నారు. చాన్నాళ్ల నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎటువంటి జీతాన్ని తీసుకోవడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకే ప్రతి నెల 40 వేల జీతాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు దీదీ తెలిపారు. అయితే పెరిగిన జీతంతో మొత్తం ఎంత తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.













