మమత బెనర్జీకి షాక్… కేంద్ర సర్వీసుల్లోకి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్‍ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రం సమచారం ఇచ్చింది. 1987 బ్యాచ్‍కు చెందిన ఐఏఎస్ అధికారి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలచినట్లు.. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం పంపింది. తక్షణమే ఆయనను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిలీలోని డీఓపీటీ కార్యాలయంలో 31వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆయనకు సూచించింది.
ఆలాపన్ బందోపాధ్యాయ్ మే 31 నాటికి 60 ఏళ్లు నిండనున్నాయి. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం ఆరు నెలల పాటు పెంచాలని కోరుతూ ఈ నెల 12న మమత ప్రధానికి లేఖ రాశారు. యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమవేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఆదేశాలు వచ్చాయి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే బలవంతంగా డెప్యూటేషన్‍పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించింది.