బెంగాల్ లో ముగిసిన ఆరో దశ పోలింగ్….
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్… సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 80 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ముగిసిన ఐదు విడతల పోలింగ్లో 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. నాలుగో విడతలోనే అతి తక్కువగా 79.90 శాతం ఓటింగ్ నమోదైంది. మిగితా అన్ని విడతల్లోనూ దాదాపుగా 80 శాతం నమోదైంది. అయితే సాయంత్రం 5 వరకే 80 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది కాబట్టి, మరింత పెరిగే అవకాశముంది. ఆరో విడతలో భాగంగా 43 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ జరిగింది. 13,87,791 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.













